విరాట్ క్యాచ్ కి ఆశ్చర్యపోయిన అనుష్క

Monday, April 30th, 2018, 06:13:11 PM IST

ఇండియన్ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల లిస్ట్ తీస్తే అందులో విరుష్క జోడి ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కొంచెం గ్యాప్ దొరికినా కూడా ప్రేమ పక్షుల్లా విదేశాలు చుట్టేస్తారు. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అనుష్క వీలుచిక్కినప్పుడల్లా తన భర్త మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వచ్చేస్తోంది. ఆదివారం చెన్నై – బెంగుళూర్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించడానికి కూడా అనుష్క వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ ఓ క్యాచ్ పట్టగా అనుష్క ఆశ్చర్యపోయి రియాక్షన్ ఇచ్చిన తీరు అందరికి ఆకట్టుకుంది. ఆమె రియాక్షన్ చూసి ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేస్తున్నారు. 19వ ఓవర్లో సిరాజ్‌ వేసిన 5వ బంతిని దినేశ్‌ కార్తీక్‌ బలంగా కొట్టగా బంతి గాల్లోకి లేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా కోహ్లీ ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. అది చూసి అనుష్క ఆశ్చర్యపోయింది. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  •  
  •  
  •  
  •  

Comments