వైరల్ అవుతున్న అనుష్క కొత్త లుక్ – కొత్త రూమర్స్ మొదలెట్టిన నెటిజన్లు ..!

Tuesday, February 12th, 2019, 05:16:35 PM IST

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ స్వీటీ అనుష్క శెట్టి కొత్త లుక్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది, సైజు జీరో తర్వాత ఎక్కువ వెయిట్ పెరిగిన అనుష్క తర్వాత తగ్గాలని ఎంత ట్రై చేసినా ఫలితం దక్కలేదు. ఇక అనుష్క కెరీర్ ముగిసినట్లే అన్న కామెంట్స్ మొదలయ్యాయి, ఇటీవల రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లిలో మెరిసిన అనుష్క కాస్త సన్నబడ్డట్టే అనిపించిన అనుష్క మునుపటిలా స్లిమ్ గా అయితే అనిపించలేదు. యోగా ద్వారా, ప్రాకృతిక పద్దతిలోనే తగ్గాలని డిసైడ్ ఐన అనుష్క తీవ్రంగా శ్రమించి బాగా స్లిమ్ అయ్యింది.

ఇటీవల తన లుక్ తో ఉన్న ఫోటోలను వదిలింది అనుష్క, వైట్ డ్రెస్ లో సముద్ర తీరాన అదిరిపోయే స్కిన్ టోన్ తో మళ్ళీ పాత అనుష్కను గుర్తు చేస్తోంది స్వీటీ. అయితే ఆ ఫోటోలలో ఒక యువకుడితో ఉంది అనుష్క, అంతే ఇక నెటిజన్లు తమ నోటికి పని చెప్పారు. ఫొటోలో ఉన్న ఆ యువకుడికి అనుష్కకు లింకులు కట్టడం మొదలెట్టారు.కలిసి ఫోటోలు దిగారంటే ఇద్దరి మధ్య ఎదో ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు, వాస్తవం ఏంటంటే ఆ యువకుడు ల్యూక్ కొటిన్హో, అతడు అనుష్క న్యూట్రిషనర్. శరీరాన్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ప్రాకృతిక పద్దతిలో వెయిట్ తగ్గేందుకు అనుష్కకు సహకరించింది ఇతనే, అంతే తప్ప నెటిజన్లు అంటున్నట్టు వారిద్దరి ఏమీ లేదు .