వేడెక్కనున్న ఏ పీ వర్షాకాల అసెంబ్లీ సమావేశం..!

Thursday, September 6th, 2018, 12:30:35 PM IST

చాలా నెలల విరామం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. వార్షిక బడ్జెట్ సమావేశం మరియు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి విడిపోయిన తర్వాత జరగబోయే మొట్టమొదటి సమావేశం కావున ఈ సమావేశం పై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షంగా భారతి జనతా పార్టీ ఉండబోతున్నది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షము ఉన్న చోటులో వై కా పా ఉండవలసి ఉన్నది కానీ వారు హాజరు కావాలంటే తమ పార్టీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేయాలని అంతే కాకుండా వారిలో ఎం.పీ పదవి కట్టబెట్టిన వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి అని బలం గా డిమాండ్ చేసారు. లేకపోతే వారు ఈ సమావేశానికి హాజరు కామని తెలియజేసారు.

అందుకే దీని మీద వారు హాజరు కానీ పక్షం లో ప్రధాన ప్రతిపక్ష స్థానంలో బి.జె.పి వారు ఉండాల్సివచ్చింది.. దీనితో తెలుగుదేశం పార్టీ వారు ఇదే మంచి సమయం గా భావించి ఆంధ్ర రాష్ట్రంకి జరిగిన అన్యాయాన్ని, విభజన హామీల విషయంలో గాని ముఖ్యంగా వారు ఇచ్చిన మాట ప్రకారం “ప్రత్యేక హోదా” విషయం లో కానీ ఇతర ముఖ్య అంశాల మీద చర్చలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని ఇంకా వేటిలో లేవనెత్తుతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  •  
  •  
  •  
  •  

Comments