కలత చెందిన హరిబాబు బీజేపీకి గుడ్ బై చెప్తున్నాడా?

Friday, March 30th, 2018, 04:42:04 PM IST

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. రాబోవు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి పైడికొండల మాణిక్యాల రావుని ఎంపిక చేసే అవకాశం ఉండటంతో హరిబాబు నిరాశ చెందినట్టు ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన బీజేపీ నష్టనివారణ చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ గా మాణిక్యాలరావుని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వత్రా సిద్దం చేసింది.

అయితే నిజానికి దీనికి ప్రధాన కారణం మాత్రం అసలు ఇది కాదు. ఇన్ని రోజులుగా ప్రత్యెక హోదా అని, హామీలు నెరవేర్చాలనీ, అవిశ్వాస తీర్మానం అని ఇన్ని జరుగుతున్నా కూడా తెలుగుదేశం విషయంలో హరిబాబు దూకుడుగా వ్యవహరించడం లేదని దానికి తోడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి కూడా సరైన దాడి చేయలేకపోయారని.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనితో అధిష్టానం ఆయనను తప్పించాలని భావించింది. దీనితో హరిబాబు పార్టీ వీడే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరం కావాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి సపూర్టు ఉండదని గనక హరిబాబు కూడా తెలుగుదేశం విషయంలో అలా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాడని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నట్టు సమాచారం.