చంద్రబాబు సడెన్ గా షాకింగ్ డెసిషన్..!

Friday, December 1st, 2017, 09:00:48 PM IST

కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా కాపు రిజర్వేషన్ల కోసం, వారిని బిసి లలో చేర్చడం కోసం ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాపు నాయకుడు ముద్రగడ కేంద్రంగా ఏపీలో అనేక రాజకీయ పరిమాణాలు చోటుచేసుకున్నాయి. మంజునాథన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. శనివారం మరో మారు ఎపి కేబినెట్ భేటీ అవుతుంది. ఈ భేటీలో కాపు రిజర్వేషన్లపై సమగ్రంగా చర్చిస్తామని ప్రకటించారు.

కాపులని బీసీలలో చేర్చాలనే డిమాండ్ ఓ వైపు వినిపిస్తున్న నేపథ్యంలో అలా చేస్తే బిసిలు నష్టపోతారని బిసి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో బిసిలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎఫ్ కేటగిరిని క్రియేట్ చేసి కాపులని చేర్చనున్నారు. కాపు, బలిజ, తెలగ కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇది కాపులకు నిజంగా పండుగ దినం అని మంత్రి గంటా అన్నారు. శనివారం కేబినెట్ నిర్ణయం తరువాత కాపు రిజర్వేషన్లకు సంబందించిన బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ఇదిలా ఉండగా బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ నిర్ణయాన్ని బిసి లంతా వ్యతిరేకించాలని అన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో బిసి ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments