జనం చెవుల్లో పూలు పెడుతున్నారు: చంద్రబాబు

Tuesday, June 5th, 2018, 10:13:40 AM IST

తనపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా వాటి నాటకాలు కొనసాగవని చివరికి న్యాయమే గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశంపై పార్టీపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలే న్యాయం చెబుతారని బీజేపీతో కలిసిన పార్టీలకు ఎండ్ కార్డు పెట్టె సమయం ఆసన్నమైంది అన్నారు. కావాలనే మాపై విమర్శలు చేస్తున్నారు. విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఆ విషయంలో హద్దులు మీరు ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు.

“బీజేపీ కుట్రలో భాగంగానే జగన్ పవన్ మాపై నిందలు వేస్తున్నారు. జగన్ కొత్త తరహా రాజీనామాల నాటకాలు ఆడుతున్నారు. మేము రాష్ట్ర ప్రయోజనం కోసం మంత్రి పెదవులని లెక్క చేయలేదు. ఆర్డచకుడిని అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో జగన్ వంటి అవినీతి పరులకు కేంద్రం లో ఉన్న బీజేపీ పార్టీ అండగా నిలుస్తోంది. వైఎస్సార్ సిపి నాయకులు మొత్తం కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారని మళ్లీ రాజీనామాలు చేసినట్టు జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని” చంద్రబాబు తెలిపారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో వారి చెవుల్లో జనాలే పూలు పెడతారని సీఎం వ్యాఖ్యానించారు.