చంద్ర‌బాబు ఇంటెలిజెంట్ గేమ్‌!

Monday, October 29th, 2018, 10:00:25 AM IST

తెలంగాణ‌లో చంద్ర‌బాబు మ‌ళ్లీ త‌న ప‌ట్టును సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడా?, తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పి అధికారం చేప‌ట్ట‌క‌పోయినా అదుపులో ఉంచే ప‌వ‌ర్ గుప్పిట ప‌ట్టాల‌ని, త‌న‌ క‌నుస‌న్న‌ల్లో తెలంగాణ పాల‌న సాగాల‌ని చంద్ర‌బాబాబు ఎత్తులు వేస్తున్నారా? అంటే తాజా ప‌రిస్థితులు అవున‌నే సంకేతాలిస్తున్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎంగా వెలిగిన చంద్ర‌బాబుకు హైద‌రాబాద్‌పై మ‌మ‌కారం, త‌ప‌న‌ పోలేదు. అదే త‌న‌ని తెలంగాణ చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేసేలా చేస్తోంది. కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టి మ‌హాకూట‌మి పేరుతో ఎథిక్స్‌ని మ‌రిచి ప్ర‌వ‌ర్తించేలా చేస్తోందన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ‌లో త‌న‌కు అనుకూల వ‌ర్గం చేతికి అధికారం వ‌స్తే తాను ఆడిందే ఆట‌గా సాగుతుంద‌ని, అమ‌రావ‌తి నుంచే చ‌క్రం తిప్పొచ్చ‌ని బాబు కుటిల రాజ‌కీయానికి తెర‌తీస్తున్నాడ‌ని తెరాస శ్రేణులు మండిప‌డుతున్నాయి. త‌న పంతం నెగ్గించుకోవ‌డం కోసం… ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించ‌డం కోసం సొంత మామ‌కే వెన్నుపోటు పొడిచి స్వ‌యానా ఆయ‌న చావుకి కార‌ణ‌మైన చంద్ర‌బాబు తెలంగాణ‌లో అధికారం కోసం మ‌రోసారి అదే త‌ర‌హా ద్వంద్వ వైఖ‌రి రాజ‌కీయాల‌కు రెడీ అయ్యాడ‌ని తేరాస నాయ‌కులు ప‌దే ప‌దే విమ‌ర్శిస్తున్నారు. ఇందు కోసం బాబు ఏకంగా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకుంటున్నార‌న్న వాద‌నా వినిపిస్తున్నారు.

ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ జిల్లా ధ‌ర్మ‌పురిలో ముగ్గురు ప‌ట్టుబ‌డిన తీరు తాజా అనుమానాల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది. న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న‌చందంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి వుంద‌ని గులాబీ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీనికి ముందు కోరుట్ల‌లోనూ ఓ వ‌ల‌స నేత‌ను క‌లిసి మ‌ళ్లీ టీడీపీలోకి రావాల్సిందేనంటూ చంద్ర‌బాబు కోర‌డాన్ని బ‌ట్టి ఏ స్థాయికి రాజ‌కీయాల్ని దిగ‌జార్చారో అర్థమ‌వుతోంద‌ని తెరాస నేత కేటీఆర్ ఇటీవ‌ల చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో ఏపీ ఇంటెలిజెన్స్‌కు ప‌నేంటి? అంటూ సాక్షాధారాల‌తో కేటీఆర్ రాష్ట్ర ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేయ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌ల వేళ కూడా బాబు రాజ‌కీయాల్ని ప్ర‌స్థావించి, తేరాస‌- తేదేపా క‌లిసి ఉండాల‌ని అన్నార‌ని కేటీఆర్ షాకిచ్చే విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే యువ‌నాయ‌కుడు కేటీఆర్ త‌న‌కంటే ఎంతో సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబు గేమ్‌ని చాలా తెలివిగా ప‌సిగ‌ట్టేసారని, తండ్రి బాట‌లోనే చాణక్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని తేరాస ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తెలంగాణ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు ప్రాతినిధ్యాన్ని.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాలో అయినా ఉండడాన్ని యువనేత స‌హించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని మాట్లాడుకుంటున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments