దుబాయ్ లో చంద్రబాబు స్పీడ్

Monday, October 23rd, 2017, 10:51:47 AM IST

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగైనా వచ్చే ఎలక్షన్స్ లోపు వీలైనంత వరకు రాజధాని పనులను పూర్తి చేయాలనీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అభివృద్ధి పనుల్లో చురుగ్గా ఉండే ఆయన ప్రస్తుతం రాజా దాని నిర్మాణ కోసం దుబాయ్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలను తీరిగొచ్చిన బాబు ఇప్పుడు దుబాయ్ లో కూడా అంతే స్పీడ్ గా తన పని చేసుకుంటూ పోతున్నారు.

అయితే ఆయన స్పీడ్ చూసి యూఏఈ ప్రభుత్వం ప్రశంసలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా అభివృద్ధి కోసం చంద్రబాబు చాలా కృషి చేస్తున్నారని యూఏఈ ఆర్థికమంత్రి బిన్‌ సయీద్‌ అల్‌ మన్సూరీ ప్రశంసించారు. అలాగే గతంలో కూడా సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇదే స్థాయిలో చొరవ చూపించారని చెబుతూ.. ఎమిరేట్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఇక అయన ఏదైనా పని మొదలుపెడితే అది పూర్తయ్యేవరకు ఆపరని ఎమిరేట్స్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ ఇన్‌చార్జి అద్నాన్‌ ఖాజిమ్‌ తెలియజేశారు. ఫ్లై దుబాయ్‌ సీఈవో ఘయిత్‌ అల్‌ ఘయిత్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments