“పవన్ కళ్యాణ్ , వై.సి.పి , బి.జే.పి మీద సంచలన వ్యాఖ్యలు”.. చంద్రబాబు.!

Wednesday, September 5th, 2018, 03:32:09 AM IST

కేంద్ర ప్రభుత్వం అయిన బి.జే.పీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తున్నది అని, రాజధాని నిర్మాణానికి యాభై వేల కోట్లు అవసరమైతే అందుకు గాను వారు కేవలం పది ఐదు వందల కోట్లు ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదు అని కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు . అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు వారు ఇచ్చిన మాట ప్రకారం “ప్రత్యేక హోదా” ఇవ్వకుండా వారు చేసిన తీరుని ముఖ్యమంత్రి ఎండగట్టారు. అదే సమయం లో “ప్రత్యేక హోదా” కోసం మొన్న ఒక వ్యక్తి చేసుకున్న ఆత్మ హత్యను గుర్తు చేసారు.

మనం “ప్రత్యేక హోదా” సాధించుకోడానికి ఎలాంటి ప్రాణ నష్టం అవసరం లేదు అని మన పోరాటం చేద్దాం అని ఆ పోరాటం తో ఒకవేళ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం లో భారతీయ జనతా పార్టీ ని గద్దె దించి మనకి రావాల్సిన “ప్రత్యేక హోదా” ని సాధిద్దాం అని చంద్రబాబు నాయుడు గ్గారు గట్టిగా నినదించారు. అదే సమయం లో బి.జె.పీ పార్టీ వారు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలవలేరని తెలిసి దొడ్డి దారిన వస్తున్నారని, వారికి పవన్ కళ్యాణ్ మరియు వై.ఎస్.ఆర్ పార్టీ వారు సహకరిస్తున్నారు అని, ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి అని ఈ నాలుగేళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నది బి.జె.పీ సహకారం తో కాదు అని మన కష్టార్జితం తో అని అది గుర్తుంచుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా చింతల పూడి గ్రామం లో ఏర్పాటు చేసిన సభలో మండిపడ్డారు

  •  
  •  
  •  
  •  

Comments