శీతాకాలంలో పార్లమెంట్ హీట్..పవన్ దారిలోనే వెళ్లమన్న ముఖ్యమంత్రి..!

Wednesday, November 16th, 2016, 09:31:18 AM IST

chandrababu
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి ల వైఖరిని సుతిమెత్తగా తూర్పారబట్టారు.ప్రత్యేక హోదా పై మాట తప్పిందని బిజెపి పై. ప్రత్యేక ప్యాకేజ్ కు అంగీకరించిన టిడిపి పై ఆయన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బిజెపి వైఖరి పై చంద్రబాబు కూడా అసంతృప్తి తో ఉన్నారు.లోటు బడ్జెట్ లో మొదలైన రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పడానికే రెండున్నరేళ్ల సమయం తీసుకుంటే వాటిని అమలు చేయడానికి ఎన్నిరోజులు తీసుకుంటారో అన్న అనుమానాల్ని చంద్రబాబు ఎంపీ వద్ద చర్చించినట్లు తెలుస్తోంది. నేటి నుంచి పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ కి సంభందించిన సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తేందుకు తీసుకోవలసిన చర్యలపై బాబు ఎంపీ లతో చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా అనంతపురంలో పవన్ ప్రసంగాన్ని చంద్రబాబు సమర్థించారని తెలుస్తోంది. పవన్ చెప్పినట్లుగా ప్రత్యేక ప్యాకేజ్ కు చట్టభద్రత కల్పించేవరకు కేద్రం పై ఒత్తిడి తేవాలని బాబు ఎంపీలతో అన్నారు.తనకు పవన్ ప్రసంగంలో తప్పేమి కనిపించలేదని ఆయన అన్నారు. కాగా కేంద్రానికి పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఇకనైనా జాప్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్ కు నిధులు విడుదల చేసేలా కేంద్రం పై ఒత్తిడి తేవాలని బాబు ఎంపీలకు సూచించారు.