అమిత్ షా ఆ నాట‌కాలేంటి?

Tuesday, September 18th, 2018, 04:03:39 PM IST

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చంద్ర‌బాబు నాయుడు నిమిషానికో ల‌క్ష చొప్పున లాయ‌ర్ల‌కి ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగింది. ఎనిమిదేళ్ల నాటి ఉచ్చు ఇప్పుడు మెడ‌కు చుట్టుకోవ‌డమేంటో అర్థం కాని గంద‌ర‌గోళంలో ప‌డిపోయార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

అయితే ఇదంతా కేంద్రం కుట్ర‌. షా, మోదీ ప‌న్నిన ప‌న్నాగం అంటూ తేదేపా తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే ఎనిమిదేళ్ల నాటి గొడ‌వ అయినా అది కోర్టుల ప‌రిధిలోని వ్య‌వ‌హారం క‌దా! అని కొంద‌రు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఓ స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ .. అమిత్ షా నాట‌కాలాడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. వారెంట్ల విషయంలో మాకు సంబంధం లేదని అమిత్ షా అంటున్నారు. మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉంది..? కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది..? నాటకాలు ఆడాల్సిన అవసరమేంటి అని ప్ర‌శ్నించారు బాబు. బ్యాంకులను దోచేవారిని విదేశాలకు పంపుతున్నార‌ని ఎన్డీఏ- భాజ‌పా వ‌ర్గాల్ని ఉఠంకించారు చంద్ర‌బాబు. మాల్యా, నీర‌వ్ మోదీల స‌పోర్టర్స్‌గా భాజ‌పా వ‌ర్గాల్ని అభివ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేశారు.

ప్రాజెక్టులపై త‌న ఉద్య‌మాల గురించి వివ‌ర‌ణ ఇస్తూ .. ఎస్సారెస్పీ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు కట్టారు. అప్పటి ప్రభుత్వం ఏం పట్టించుకోకుంటే.. నేను ఉద్యమించాన‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. బాబ్లీ విషయంలోనే కాదు.. ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలోనూ పోరాడాను. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరిగా వాదనలు వినిపించకుండా ఎత్తు పెంచినా ఆపలేకపోయాయి. ఎనిమిదేళ్ల తర్వాత నాపై వారెంట్లు జారీ చేెశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొత్తానికి త‌న‌పై భాజ‌పా పెద్ద కుట్ర‌కు పాల్ప‌డింద‌న్న ఆవేద‌న బాబు మాట‌ల్లో వ్య‌క్త‌మ‌వ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది.