జగన్ డిసీషన్: ఏపీలో సీబీఐకీ గ్రీన్ సిగ్నల్.. వణుకుతున్న టీడీపీ నేతలు..!

Sunday, June 2nd, 2019, 05:41:21 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అయితే జగన్ ముందు నుంచి అవినీతి లేని పాలన అందిస్తా అని చెప్పుకొస్తున్నాడు. అందులోనే భాగంగా ఇప్పుడు ఏపీలో సీబీఐ సోదాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో విభేదించిన త‌రువాత ఓ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దుర్వినియోగం చేస్తుంద‌ని ఆరోపిస్తూ ఏపీలో సీబీఐకి జ‌న‌ర‌ల్ క‌న్సెంట్‌ను ర‌ద్దు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ, పోలీసుల అనుమ‌తి తీసుకోకుండా సీబీఐ దాడి చేయ‌టానికి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే వీటిని దిక్కరిస్తూ అప్పట్లో న‌ర్సాపురం ఎంపీగా వైసిపి నుండి పోటీలో ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు ఇంటి పైనా, తెనాలిలో ఓ ఐటి అధికారిపైనా సీబీఐ సోదాలు నిర్వహించింది. అయితే ఈ ఘ‌ట‌న‌ల పైనా అప్పుడు అధికారులు సీబీఐ త‌మ ఉత్త‌ర్వులను అధిగ‌మించిందంటూ ఆరోపణలు చేయగా సీబీఐ కూడా దానికి వివరణాత్మకంగా సమాధానం చెప్పుకుంది. అయితే తాజాగా టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిపై సీబీఐ దాడులు చేసింది. అయితే ఈయన కంపెనీకి సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కేసును కూడా నమోదు చేసింది. అయితే ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక అవినీతిని నిరోధించాలనే దిశగా కొత్త మలుపులకు అడుగులు వేశారు. అయితే గత ప్రభుత్వం సీబీఐ జ‌న‌ర‌ల్ క‌న్సెంట్‌్‌పై ఉన్న జీవోను రద్ధు చేస్తూ ఏపీలో ఇక ఏ కేసు అయినా స్వతంత్రంగా విచారణ చేసుకునే అవకాశాన్ని కలిపించారు. అయితే వచ్చి రాగానే జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో జగన్ టార్గెట్ మాపైనే ఉంటుందేమోనని టీడీపీ నేతలు ప్రస్తుతం వణికిపోతున్నారట.