బిగ్ బ్రేకింగ్ : నెల్లూరు జిల్లా నుంచి జగన్ ఫిక్స్ చేసిన మంత్రులు వీరే.?

Sunday, May 26th, 2019, 12:00:52 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ దెబ్బకు ఈసారి ఎన్నికలు వార్ వన్ సైడ్ అయ్యిపోయిందని చెప్పాలి.పోలింగ్ మొదటి నుంచి కూడా వైసీపీ దూకుడు చూపించడంతో అనుకున్న దానికంటే ఎక్కువగానే వారికి అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలు దక్కాయి.అయితే ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల నుంచి మరో సమాచారం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.జగన్ తన మంత్రి వర్గం క్యాబినెట్ ను కూడా ఇప్పటికే జిల్లాల వారీగా నియమించినట్టు తెలుస్తుంది.

తాజాగా జగన్ నెల్లూరు జిల్లా నుంచి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులకు మంత్రి వర్గ పదవులు అప్పజెప్పేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ముందుగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి మరియు కోవూరు నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అలాగే అదే జిల్లా నుంచి మూడో అభ్యర్థిగా సూళ్లూరుపేట నుంచి గెలుపొందిన కిలివేటి సంజీవయ్య లు జగన్ ఆయా శాఖలకు చెందిన మంత్రి పదవులకు ఫిక్స్ చేసి బాధ్యతలు అప్పగించనున్నారని అంతర్గత సమాచారం.