ప్రత్యేకహోదా రాలేదని ఆత్మహత్య చేసుకున్న బాలుడిపై..చంద్రబాబు స్పందన.

Wednesday, September 19th, 2018, 12:20:53 PM IST

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడం వల్లనే తన అన్నయ్యకు ఉద్యోగం రాలేదని ఇదే పరిస్థితులు కొనసాగితే రేపు తనకి కూడా ఉద్యోగం రాదనీ తీవ్రమైన మనస్తాపంతో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం అనే గ్రామంలో మహేంద్ర అనే ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషయం పై పలువురు రాజకీయ నాయకులు వారి సంతాపాన్ని తెలియజేసారు ఇప్పుడు ఈ విషయం పైనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తన స్పందన తెలియజేసారు.

అసలే కటిక పేదరికం తన తండ్రికి ఆరోగ్యం బాగుండడం లేదు తన అన్నయ్యకు ఉద్యోగం వస్తే పరిస్థితి కొంచెం ఐనా మెరుగుపడుతుంది అనుకున్నాడు మహేంద్ర ఆ అవకాశాలు కొంచెం కూడా లేవని ఇక ఆత్మహత్య చేసుకున్నాడు.దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ మహేంద్ర అనే బాలుడు ప్రత్యేకహోదా రాలేదన్న కారణంగా చనిపోవడం చాలా బాధ కలిగించింది అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మీ ప్రాణం చాలా విలువైనిది అని ఈ సమస్య కూడా చాలా సున్నితమైనిది అని మన అందరం కలిసి సమస్య పట్ల పోరాడుదాం అని,మనకు రావల్సిన హక్కులు సాధించుకుందాం అని దాని కోసం ఎవరూ ఆత్మహత్య ప్రయత్నాలు చెయ్యొద్దని తెలిపారు.ఇంతకు మునుపే చాలామంది కూడా ఇలా మనస్తాపానికి లోనయ్యి అఘాయిత్యాలు చేశారని తెలిపారు.ఇలాంటి విషాధ చర్యలకు పాల్పడినటువంటి వారి అందరికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వారి కుటుంబాలని అన్ని విధాలా ఆదుకుంటాము అని ప్రత్యేక హోదాకోసం చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతిని సీఎం తెలియజేసారు.