ఆంధ్రప్రదేశ్ లో “యువనేస్తం” పథకం ప్రారంభం…!

Wednesday, September 12th, 2018, 09:08:15 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర నిరుధ్యోగులకు ఎప్పుడెప్పుడా అని ఎదెరు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి నిరుద్యోగ సమస్య నీడలా వెంటాడుతూనే ఉంది ఐతే దీనికి భరోసాగా నేస్తంలా మేము ఉన్నాం అంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల కొరకు “యువనేస్తం” పేరిట ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. నిన్ననే మంత్రి నారా లోకేష్ గారు అక్టోబర్ 2 వ తేదీ నుంచి వారి యొక్క వెబ్ సైటు లో రిజిస్టర్ కావాలని సూచించారు.

దీనిపై వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రం లో కూడా ఇప్పటివరకు 1000 రూపాయల నిరుద్యోగభృతి ఎవరు ప్రకటించలేదు అని మొట్ట మొదటి సారిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది అని తెలిపారు. నిరుద్యోగభృతి అంటే కేవలం డబ్బులు వేయడం ఒకటే కాదని ఇందులో నాలుగు ఉన్నాయని, నైపుణ్య అభివృద్ధి పరికల్పన, స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పన, చివరగా నిరుద్యోగ భృతి ఉంటుందని తెలిపారు. దీనికి గాను వచ్చే నెల రెండవ తేదీన వారు సూచించునటువంటి వెబ్ సైట్ లో రిజిస్టరు కావాలని, ఎవరైతే ఆంద్ర రాష్ట్రంలో డిగ్రీ పట్టా పొంది ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నారో వారు అందరు అర్హులే అని తెలిపారు మన రాష్ట్రంలో దాదాపు 12 లక్షల పై చిలికు నిరుద్యోగులు ఉన్నారని వారి అందరికి ఈ యువనేస్తం పథకం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments