పోలీస్ vs రోజా..

Friday, February 24th, 2017, 11:58:39 AM IST


డీజీపీ సాంబశివరావు ని టార్గెట్ చేస్తూ రోజా చేసిన వ్యాఖ్యలకి పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది .. రోజా వ్యాఖ్యలని ఖండిస్తూ అసోసియేషన్ అధ్యక్షులు తాము ఎవ్వరికీ బానిసలం కాము అనీ చట్టానికే బానిసలం అని చెప్పుకొచ్చారు. రోజా చేసిన వ్యాఖ్యలకి తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అనీ ఇలాంటి ఆమె మళ్ళీ మాట్లాడితే ఊరుకోము అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు .పోలీసు అధికారుల సంఘం తనపై విమర్శలు చేసిన నేపథ్యంలో, రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను క్షమాపణలు చెప్పాలని కోరేముందు… సచివాలయం, సీఎం నివాసం వద్ద పని చేస్తున్న పోలీసుల ఇబ్బందులపై పోరాడాలని పోలీస్ అధికారుల సంఘానికి ఆమె సూచించారు. పోలీసుల సమస్యలపై సంఘం పోరాడేందుకు సిద్ధమైతే… తాను కూడా ఆ పోరాటంలో పాల్గొనేందుకు సిద్ధమేనని చెప్పారు. అసెంబ్లీలో తనను అడ్డుకునేందుకు యత్నించే వారికి సరైన సమాధానమిస్తానని తెలిపారు.