ఏపి ఎంసెట్ లో టాప్ టెన్ ర్యాంకర్స్!

Wednesday, May 2nd, 2018, 04:03:49 PM IST

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు గత వారం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎంసెట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 1,90,922 మంది విద్యార్థులు హాజరవ్వగా అందులో 72.28 శాతంతో లక్షా 38వేల మంది పాస్ అయ్యారు. ఇక అగ్రి, మెడికల్‌ పరీక్షలకు 73,373 మంది విద్యార్థులు హాజరవ్వగా 87.6 శాతంతో 63,883 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఇక ఈ మే 26నుంచి కౌన్సెలింగ్ మొదలవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

ఎంసెట్ ఇంజినీరింగ్‌ టాప్‌-10 లో ఉత్తీర్ణత శాతాన్ని అందుకున్న విద్యార్థులు

బోగి సూరజ్ కృష్ణ (95.27 శాతం)
గట్టు మైత్రేయ (95.13)
లోకేశ్వర్ రెడ్డి (94.22)
వినాయక్ శ్రీవర్ధన్‌ (94.20)
షేక్ వాజిద్‌కు (93.78)
బసవరాజు జిష్ణు (93.51)
వంశీనాథ్‌ (92.86)
హేమంత్‌కుమార్‌ (92.71)
బొడ్డపాటి యజ్ఞేశ్వర్‌ (92.67)
ముక్కు విష్ణు మనోజ్ఞ (92.56)

అగ్రికల్చరల్‌లో టాప్‌-10

జంగాల సుప్రియ (94.78)
గంజికుంట శ్రీవాత్సవ్‌ (93.26)
శ్రీహర్ష (92.47)
గుండె ఆదర్శ్‌ (92.12)
జానుభాయ్‌ రఫియా (91.95)
ముక్తేవి జయసూర్య (91.95)
నల్లూరు వెంకట విజయకృష్ణ (91.31)
నీలి వెంకటసాయి అమృత (91.21)
వీఎఎన్‌ తరుణ్‌ వర్మ (91.18)
వంటేరు వెంకటసాయి హర్షవర్ధన్‌రెడ్డి (91.16)

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి