ఏపీ బిగ్ ఎల‌క్ష‌న్స్ : కేఏ పాల్ స‌ర్వే అవుట్.. అన్ లిమిటెడ్ వండ‌ర్స్..!

Sunday, February 3rd, 2019, 04:22:44 PM IST

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన వ్యూహాల‌తో దూసుకుపోతున్నాయి. ఒక‌వైపు అధికార టీడీపీ మ‌రోసారి విజ‌య‌భేరి మోగించాల‌ని, ఎన్నిక‌ల‌కు ముడు నెల‌ల ముందు వ‌రాల జ‌ల్లు కురిపిస్తుంది. మ‌రోసారి టీడీపీ అధికారంలోకి రాక‌పోతే, రాష్ట్రం స‌ర్వ‌నాశనం అయిపోతుందని చెబుతోంది. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో మాత్రం టీడీపీ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది. ఇక మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష వైసీపీ మాత్రం గ‌తంలో కంటే బ‌లంగానే పుంచుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌క్కువ శాతంతో ఓట‌మి చెందిన వైసీపీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగానే త‌న‌దైన వ్యూహాల‌తో ముందుకు సాగుతోంది.

ఇక ఈ ఎన్నిక‌ల్లో తాముకూడా రేసులో ఉంటామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన వామ‌ప‌క్షాల‌తో క‌లిసి బ‌రిలోకి దిగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి స‌పోర్ట్ ఇచ్చిన జ‌న‌సేన, రానున్న ఎన్నిక‌ల్లో మొత్తం స్థానాల్లో ఏ ప్ర‌ధాన పార్టీతో పోత్తు లేకుండా పోటీలోకి దిగడ‌మే కాకుండా, త‌న‌దైన ప్ర‌భావం చూపించి, చ‌క్రం తిప్పాల‌ని భావిస్తోంది. ఇక కొత్త‌గా తెరపైకి వ‌చ్చిన చిత్ర‌మైపార్టీ ప్ర‌జాశాంతి. ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త ప్ర‌భోధ‌కుడు కేఏపాల్‌కు చెందిన ప్ర‌జాశాంతి పార్టీ కూడా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో పొత్తులు కుదిరితే ఓకే.. ఎవ‌రితో పొత్తు లేక‌పోయినా 175 స్థానాల్లో బ‌రిలోకి దిగుతామ‌ని చెప్ప‌డ‌మే కాకుండా కాబోయే ముఖ్య‌మంత్రి తానే అని మీడియా ముందు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు కేఏపాల్.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్నిక‌ల వేళ జాతీయ మీడియా స‌ర్వేలు వ‌రుస‌గా తెర‌పైకి వ‌స్తున్నాయి. ఆ స‌ర్వేలు ప్ర‌స్తుతం ఏపీలో స‌మీక‌ర‌ణాలు వైసీపీకే ఎక్కువ ఉన్నాయ‌ని తేల్చేశాయి. అయితే తాజాగా కేఏ పాల్ సొంత‌గా రాష్ట్రం మొత్తం స‌ర్వే చేయించార‌ట‌. ఆ స‌ర్వేలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ.. ప్ర‌జాశాంతి పార్టీకి 79 సీట్లు విజ‌యం సాధింస్తుంద‌ని తేలింద‌ట‌. ఇక ప‌ర్సంటేజ్ ప్ర‌కారం చూస్తే.. బీజేపీకి 2 శాతం ఓట్లు, జ‌న‌సేన‌కు 5శాతం ఓట్లు, టీడీపీకి 18 శాతం, వైసీపీకి 15 శాతం, ప్ర‌జాశాంతి పార్టీకి 39 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని కేఏపాల్ స‌ర్వే తేల్చేసింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జాశాంతి పార్టీకి తిరుగు లేద‌ని, ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి తానే అని కేఏ పాల్ ప్ర‌క‌టించేసుకుంటున్నారు.

ఇక ఈ స‌ర్వే రిపోర్ట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో కేఏ పాల్ పై కామెంట్స్ ఎక్కు పెట్టారు నెటిజ‌న్లు. రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పిన‌ట్టు రాత్రి ఆయ‌న క‌ల‌లో ప్ర‌జాశాంతి పార్టీకి 79 సీట్లు వ‌స్తాయ‌ని, తానే ముఖ్య‌మంత్రిగా కేఏపాల్ అని నేను అంటూ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ట్టు క‌ల వ‌చ్చిందని, ఆ క‌ల‌నే స‌ర్వేగా మార్చి మీడియా ముందుకు వ‌చ్చార‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే కేఏపాల్ స‌ర్వే అన్ లిమిటెడ్ వండ‌ర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు అయితే కేఏపాల్ ప్ర‌జాశాంతి పార్టీ దెబ్బ‌కి, చిత్తు చిత్తు అయిపోయిన ప్ర‌ధాన పార్టీలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వేడి వేడి రాజ‌కీయాల న‌డుమ, కేఏ పాల్ ఎంట్రీ రాజ‌కీయవ‌ర్గాల్లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని ఇస్తుంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.