ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంతో 80 మంది మృతి అయినా మనసు కరగట్లేదు..!

Thursday, September 20th, 2018, 11:44:59 AM IST

ఆ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోవడంతో దోమల సంఖ్య ఎక్కువయ్యిపోయి విపరీతమైన వైరల్ జ్వరాలు పెరిగిపోయాయి.శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలలో పరిస్థితి ఐతే ఇంకా దారుణం తెగిన దారంలో నుంచి పూసలు రాలినట్టుగా ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు,సరైన వైద్య సదుపాయాలు లేక మార్గ మధ్యలో ప్రసవం అయిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుంది.గత రెండు నెలల నుంచి విజయనగర జిల్లాలోని ఇన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం వారికేం పట్టనట్టుగా నిర్లక్ష్యం వహించి దాదాపు 80 మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు.

ఈ విషయం పైనే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా ప్రభుత్వ అధికారులు ప్రజల ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని వెంటనే అక్కడి ప్రజలకు అవసరమైన సదుపాయాలూ అన్నిటిని సమకూర్చాలని మండిపడ్డారు.దానితో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని ఒక రెండు రోజులు హడావుడి చేసేసారు.ఆ తర్వాత సరా మామూలే మళ్ళీ అక్కడి ప్రజలను పట్టించుకునే నాధుడే లేడు.మళ్ళీ గడిచిన ఈ రెండు రోజుల్లోనే డెంగ్యూ మలేరియాలతో మరో ఆరుగురు ప్రాణాలను కోల్పోయాయరు.అయినా సరే అక్కడి ప్రభుత్వ అధికారులు మనసు మాత్రం కరగట్లేదు,అదే వారి ఇంట్లో సభ్యులకి ఏమైనా జరిగితే లక్షలు పోసి వైద్యం చేయిస్తారు,ఓట్లు వెయ్యడానికి మాత్రం ప్రజలు కావాలి ఇలా ప్రాణాలు పోతున్నప్పుడు మాత్రం పట్టించుకోరు.