గిరిజనుల పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం : మార్గ మధ్యలో ప్రసవం

Friday, September 7th, 2018, 10:26:05 PM IST

ఈ ప్రభుత్వాలకు గిరిజనులు అంటే చిన్న చూపో లేక వారిని ఓటు బ్యాంకుగా తప్ప మనుషులుగా కనిపించటం లేదో మరి ఈ ప్రభుత్వాలకే తెలియాలి. మొన్న ఉత్తరాంధ్ర లో గిరిజనుల మలేరియా, డెంగ్యూ జ్వరాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మరువక ముందే వారు సిగ్గుతో తల దించుకొనే సంఘటన ఎదురయ్యింది.

ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లాకి చెందిన తండా అనే గిరిజన ప్రాంతం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తండా అనే ప్రాంతానికి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపుగా 7 కిలో మీటర్లు దూరం ఉంటుంది. అది కూడా సరైన రోడ్డు మార్గం కూడా లేదు. దానితో వారు ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ 7 కిలో మీటర్లు నడిచి వెళ్లాల్సిందే, ఇది ఇలా ఉండగా అక్కడి ప్రాంతం లోని ఒక మహిళకి పురిటి నొప్పులు రాగా అక్కడి ప్రాంత ప్రజలు సరైన రోడ్డు మార్గం లేకపోవడం తో ఆమెను రెండు కర్రల మధ్య ఒక బట్టను కట్టి అందులో మోసుకుంటూ వెళ్లారు, అక్కడికి ఆసుపత్రి చాలా దూరం కావడం తో నొప్పులు ఎక్కువ అయ్యి మార్గం మధ్యలోనే ప్రసవం అయ్యింది. అక్కడి ప్రజలు ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవడంలో ఆంధ్ర ప్రభుత్వం వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుంది.

అక్కడి ప్రభుత్వ అధికారులు తండా ప్రాంతానికి భారీగా నిధులు చేకూర్చి రోడ్డు మార్గం వేస్తామని అన్నారు దానికి గాను 2017 లోనే ఐదున్నర కోట్లు విడుదల చేశారు. ఆ డబ్బు ఏం అయ్యిందో తెలీదు ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం కూడా రాలేదు.

  •  
  •  
  •  
  •  

Comments