అన్నగారికి ‘భారతరత్న’ ప్రతిపాదన

Saturday, September 13th, 2014, 11:59:09 AM IST


దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగును ఖ్యాతికెక్కించిన మహనీయుడు అయిన నందమూరి తారక రామారావుకు ప్రతిష్టాత్మకమైన ‘భారతరత్న’ పురస్కారాన్ని అందచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనితో పాటుగా దాదాపు ముప్పై మంది తెలుగు ప్రముఖులకు విశిష్టమైన ‘పద్మ’ అవార్డులను ఇచ్చి వారి సేవలకు గుర్తింపు తేవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞ్యప్తి చేసింది. ఇక ‘పద్మ’ పురస్కారాల కోసం నటుడు కోట శ్రీనివాసరావు, పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, ప్రముఖ వైద్యులు జీ నాగేశ్వరరావు, తిరుపతిలోని ‘బర్డ్’ హాస్పిటల్ కు చెందిన జగదీశ్ తదితరుల పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసినట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా తెలియవస్తోంది.