ఎన్నో ఆర్తనాదాల తర్వాత ఆంధ్రాలో 20వేల ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల..!

Tuesday, September 18th, 2018, 04:12:55 PM IST

దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా.. గడిచిన నాలుగున్నర ఏళ్ళల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ విడుదలకు నోచుకోలేదు.ఈ విషయంలో మాత్రం ఆంధ్ర ప్రభుత్వం మాత్రం విఫలం అయ్యిందనే చెప్పాలి.ఐతే ఈ రోజు జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 20వేల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే చాలా సార్లు విడుదల చెయ్యాల్సిన నోటిఫికేషన్లు కొన్ని కారణాల ఆర్ధిక శాఖ అనుమతి ఇవ్వనందున ఆ నోటిఫికేషన్లు రద్దు అయ్యాయి. కానీ ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు విడుదల చేయలని బాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 4, డీఎస్సీ, పోలీసు శాఖల్లో ఉన్నటువంటి అన్ని ఇతర ఖాళీలను మొత్తం 20,010 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు అని తెలుస్తుంది.ఆర్ధిక శాఖనుంచి అనుమతి రాగానే వెంటనే అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తారు అని తెలుస్తుంది.