ఏపీ ప్రభుత్వం కేరాఫ్ దుబారా ఖర్చు

Monday, February 20th, 2017, 11:38:46 AM IST


ఆర్ధిక సమస్యల తో సతమతం అవుతున్న ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ వారు పెడుతున్న ఖర్చు చూస్తుంటే ఎంతటి దుబారా చేస్తున్నారా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలోచనలే చిత్ర విచిత్రంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఏపీని మరింత అప్పుల్లోకి దించేస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. అంతేకాదు.. పర్మినెంట్ భవనాల్ని నిర్మించటం వదిలేసి.. అదరాబాదరాగా తాత్కాలికం మీద ఆయన ప్రదర్శిస్తున్న మోజు చూస్తే ఏమనాలో అర్థం కాదు.ఇప్పటికే వేలాది కోట్లు తగలబెట్టేసి తాత్కాలిక ఏపీ సెక్రటేరియట్ కట్టేసిన చంద్రబాబు.. తర్వాతి రోజుల్లో పర్మినెంట్ సెక్రటేరియట్ కడతామని చెబుతున్నారు. రెండు ఆలస్యమైనా.. శాశ్విత భవనాల్ని నిర్మించాల్సింది పోయి తాత్కాలిక భవనాలు ఎందుకన్నది అర్థం కాదు. ఇప్పుడీ తాత్కాలిక భవనాల నిర్మాణంలో మరొకటి వచ్చి చేరింది. తాత్కాలిక అసెంబ్లీ.. మండలి భవనాల్ని సిద్ధం చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.515 కోట్లు ఖర్చుచేసినట్లుగా ఏపీ సర్కారు వెల్లడించింది. భవిష్యత్తులో శాశ్విత అసెంబ్లీని నిర్మించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇలా తాత్కాలికం కోసం వందలాది కోట్లు.. శాశ్విత నిర్మాణాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టేస్తూ పోతే.. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుపడేది ఎప్పుడు? ఏపీ ప్రజలు బతుకులు మారేది ఎప్పుడు?