ఫైనల్ గా కాపుల రిజర్వేషన్‌ బిల్లు సక్సెస్

Sunday, December 3rd, 2017, 03:55:55 AM IST

గతకొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చాలని అధికార పార్టీపై పలువురు ఒత్తిడి తెస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా చంద్రబాబు అనుకున్నట్టుగానే కాపులను బిసిల్లో చేర్చారు. 50 ఏళ్లుగా కాపు రిజర్వేషన్స్ కోసం ఆ వర్గం వారు చాలా ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు నిర్ణయంతో వారి కల నెరవేరిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రోజు కాపులను బీసీల్లో చేర్చే బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు.ప్రస్తుతం బిసిల్లో ఏ, బి, సి, డి,ఈ, కేటగిరీలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ‘ఎఫ్’ కేటగిరిగా కాపులను (కాపు, బలిజ, ఒంటరి, తెలగ ) అందులో జతచేస్తూ.. వారికీ 5 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విద్య, ఉద్యోగాలు సంక్షేమ పథకాల్లోనే వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. బిల్లు పాస్ అవ్వడంతో అందరు ముఖ్యమంత్రిని ప్రశంసించారు.ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలుపుతూ.. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. అనంతరం చంద్రబాబు సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. అందరికి సమాన న్యాయం చేసే విధంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కాపుల కష్టాలను చాలా చూశాను. చెప్పినట్టుగా వారికి సమాన న్యాయం చేయడానికి సిద్దమయ్యాం. ఇక బిసిలను కూడా తాము ఎప్పుడు తక్కువగా చూడలేదని భవిష్యత్తులో అన్ని వర్గాల వారికీ మరింత అండగా ఉంటామని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments