ల్యాండ్ ఫ్రీ..బాబు న్యూ స్కీమ్..!

Thursday, February 16th, 2017, 08:36:59 AM IST


అమరావతి రాజధాని నిర్మాణం ఇంతవరకూ ప్రారంభం కాకపోయినా అమరావతి పేరు మాత్రం ఎపుడూ వార్తల్లో నిలిచేలా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి దాదాపు 33 వేల ఎకరాల భూమిని బాబు సేకరించిన విషయం తెలిసిందే. దీనిద్వారా రైతులకు ఎంతవరకూ మేలు జరుగుతుందో తెలియదు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం శుభవార్తని ఏపీ ప్రభుత్వం వినిపించింది.సచివాలయం లో పనిచేసే ఉద్యోగులు, వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఇళ్ల స్థలాల్ని ఉచితంగా కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించే బహుళ అంతస్థుల నిర్మాణాలకు 150 ఎకరాలనుంచి 200 ఎకరాల వరకు భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలో రాజధానిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికోసం ఉద్యోగుల నివాసాల కోసం అందరికి అనుకూలమైన,ఆమోదయోగ్యమైన స్థలాన్ని కేటాయించాలని అధికారులకు సూచించారు. చంద్రబాబు తో సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియా తో మాట్లాడారు. రాజధానినిలో ఉద్యోగులకు స్థలం కేటాయించని ప్రభుత్వం నిర్ణయించిందని నారాయణ తెలిపారు. ఉద్యోగులు సొసైటీ లుగా ఏర్పడి ముందుకు రావాలని ఆయన కోరారు. కాకపోతే రాజధానిలో వ్యక్తిగత స్థలాలు కేటాయించేంత స్థలం లేదని అందుకోసం అపార్ట్ మెంట్ లు నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన అన్నారు.