త్వరలో ఏపీ దూరదర్శన్

Thursday, September 18th, 2014, 09:32:55 PM IST


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు గురువారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఒక దూరదర్శన్ చానెల్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. అలాగే సెప్టెంబర్ 27న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ చానెల్ ప్రారంభమవుతుందని వెంకయ్య పేర్కొన్నారు. కాగా వంద కోట్ల భారీ బడ్జెట్ తో దీనిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఇక హైదరాబాద్ లో ఉన్న దూరదర్శన్ చానెల్ ఇకపై తెలంగాణ చానెల్ గా కొనసాగుతుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.