జగన్ కు జైలు ఊచలే కనిపిస్తాయి – మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Friday, November 16th, 2018, 01:28:33 AM IST

పోలవరం విషయంలో అటు కేంద్రం సాయం అందక, ఇటు ప్రతిపక్షం చేసే విమర్శలను ఎదుర్కోలేక టీడీపీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం సహాయం అందించకున్నా కూడా చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నారని, జగన్ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా అడ్డు పద్దుతున్నాడని అన్నారు. 300 కిలోమీటర్ల లోతున్న డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసాం అని, జైలు ఊచలు మాత్రమే కనిపించే జగన్ కు ఇలాంటివి కనిపించవని ఎద్దేవా చేసారు.

మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం కొద్దీ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావాలి అని అనుకుంటున్నాడని అన్నారు. కేంద్రం సాయం నిరాకరించినా, ప్రతిపక్షాలు అడ్డు పడినా, పోలవరం పూర్తి చేసే విషయంలో వెనక్కి తగ్గం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు జగన్, కొంతమంది వైసీపీ నాయకులతో కలిసి ప్రయత్నిస్తున్నాడని, వారు ఎంత ప్రయత్నించినా దాన్ని అడ్డుకోలేరని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనీ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటే సర్వ నాశనం అవుతారని అన్నారు.