చినబాబు దుబాయ్ పర్యటన..!

Saturday, November 10th, 2018, 03:49:35 PM IST

ఆంద్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దుబాయ్ పర్యటన ఖరారు అయ్యింది, దీనికి సంబంధించి అధికారులు ప్రణాళిక, కార్యాచరణను సిద్ధం చేసారు. అక్కడ లోకేశ్ గ్లోబల్ ఎకనామిక్ ఫోరమ్ అద్వర్యంలో నిర్వహించబోయే గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశం లో పాల్గొంటారు. తర్వాత 13న దుబాయిలోని తెలుగు వారితో సమావేశం కానున్నారు. 2019లో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎజెండా రూపకల్పనలో కూడా లోకేష్ పాల్గొనబోతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా లోకేశ్ దుబాయ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల దగ్గరపడుతుండటంతో అక్కడి తెలుగు వారితో లోకేష్ భేటీ కీలకం కానుంది. ఈ భేటీలో టీడీపీ గెలుపు కోసంఅక్కడి తెలుగు వారి సహకారం కోరనున్నట్టు తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగనే దుబాయ్ నుండి తిరిగొచ్చాక రాష్ట్రం లో రాబోయే పెట్టుబడుల గురించి ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది, పచ్చ మీడియా కూడా అందుకు వంత పాడుతుంది. ఈ సారి ఎన్నికల సమయం కావడం తో ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ డోస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి దుబాయ్ బయల్దేరిన చినబాబు తిరిగొచ్చాక ఎలాంటి ప్రకటన చేస్తాడో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments