ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు కుట్రపూరితం..నారా లోకేష్

Tuesday, October 9th, 2018, 03:00:50 AM IST

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అకస్మాత్తుగా జరుగుతున్న ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి.ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐటీ దాడులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ స్పందించారు.కేంద్రప్రభుత్వం ఆంద్ర రాష్ట్రం మీద చిన్న చూపు చూస్తుందని,కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల మీదనే దాడులు చేయడం అమానుషమని పేర్కొన్నారు అంతే కాకుండా ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిర్వహిస్తున్న చర్యే అని తెలిపారు.

తాను పుట్టిన ఈ 30 ఏళ్లలో ఎప్పుడు ఈ స్థాయిలో దాడులు జరగలేదని, దాదాపు 19 బృందాలుగా వచ్చి 200 మంది ఒకేసారి దాడి చేయడం ఎప్పుడు చూడలేదని తెలిపారు.ఇలా వరుసగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు నిర్వహిస్తే రేపు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రారని అందుకనే కేంద్రం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.అదే సమయంలో వై ఎస్ జగన్ పై మాట్లాడుతూ అవినీతి చేసి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు కూడా అవినీతిని అంతం చేస్తామని,మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.