ఏపీ ఎంపీలు తెచ్చిన గుడ్ న్యూస్..బాబుకి మాత్రమే..!

Saturday, January 6th, 2018, 12:45:40 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయి ఏడాదిన్నర గడుస్తోంది. ఇంతవరకు చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్ దక్కలేదు. కాగా నేడు ఏపీ ఎంపీలు నరేద్రమోడీని కలిశారు. ఎప్పటిలాగే ఏపీ కష్టాలు ఇవి అంటూ ఓ లేఖని మోడీకి ఇచ్చి వచ్చారు. ఏపీ సమస్యల పరిష్కారానికి మోడీ ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు కానీ త్వరలోనే చంద్రబాబుని కలిసేందుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

చంద్రబాబుతో సమావేశం అయి పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని తదితర అంశాల గురించి చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రధానిని కలసిన ఎంపీల్లో టిడిపి మరియు బిజెపి వాళ్లు మాత్రమే ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ సమస్యలు అలాగే పెండింగ్ పడుతూ వస్తున్నాయి. దీనిపై ప్రధానితో మాట్లాడాలని చంద్రబాబు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దక్కలేదు. ఇటీవల జగన్ ప్రధానితో భేటీ కావడంతో బిజెపి – వైసిపి మధ్య మైత్రి కుదురుతోందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.