ఏపీ నూతన మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తి…

Friday, June 7th, 2019, 03:11:19 AM IST

కొద్దీ రోజుల క్రితమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి సంబందించిన మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తీ చేశారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా సరైన కట్టుదిట్టమైన భద్రతతో జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మమ్యం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో గురువారం ఆయన పలువురు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈనెల 8న ఉదయం 11:49 గంటలకు అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరపనున్నారని, ఈ కార్యక్రమానికి వచ్చే అతిధులకు, ఆహ్వానితులకు అందరికి కూడా వారి స్థానాలకు చేరుకునేందుకు సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిం చారు.

ఇక్కడికి చేరుకున్న వారందరికీ కూడా తాగు నీరు, అల్పాహారం అందించడంలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారానికి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిజిపి గౌతం సవాంగ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి జగన్, గవర్నర్ నరసింహన్ ఇద్దరు వేదిక వద్దకు చేరుకోగానే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరపనున్నారని చెప్పారు.