ఏపీ కొత్త మంత్రులు – వారికి కేటాయించిన శాఖలు…

Sunday, June 9th, 2019, 12:05:08 AM IST

ఏపీలో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సంబంధిత శాఖలను కేటాయించారు ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి… కాగా అనుకోని రీతిలో సుచరితకు హోంశాఖ అప్పగించారు జగన్. ఏపీకి తొలి మహిళా హోంమంత్రిగా సుచరిత తన బాధ్యతలను నిర్వహించనున్నారు… అంతేకాకుండా అనూహ్యంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులను అప్పగించారు జగన్. వారు… పుష్ప శ్రీవాణి (ఎస్టీ), పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ), ఆళ్ల నాని (కాపు), నారాయణస్వామి (ఎస్సీ), అంజద్ భాషా (మైనార్టీ) డిప్యూటీ సీఎం పదవులను కేటాయించారు.

కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు, సంబంధిత శాఖలు, వాటి వివరాలు…

1 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు పుంగనూరు రెడ్డి చిత్తూరు
2 మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు వాణిజ్యం, ఐటీశాఖ ఆత్మకూరు రెడ్డి నెల్లూరు
3 బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్, అటవీ శాఖ ఒంగోలు రెడ్డి ప్రకాశం
4 బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థికశాఖ, శాసనభ వ్యవహరాలు డోన్ రెడ్డి కర్నూలు
5 ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఎర్రగొండపాలెం ఎస్సీ ప్రకాశం
6 బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ చీపురుపల్లి బీసీ విజయనగరం
7 ధర్మాన కృష్ణదాస్ రోడ్లు భవనాలు నరసన్నపేట బీసీ (వెలమ) శ్రీకాకుళం
8 పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ ఎమ్మెల్సీ బీసీ (శెట్టి బలిజ) తూర్పు గోదావరి
9 అవంతి శ్రీనివాస్ పర్యాటక శాఖ భీమిలి కాపు విశాఖపట్నం
10 ఆళ్ల నాని వైద్య,ఆరోగ్యశాఖ ఏలూరు కాపు పశ్చిమ గోదావరి
11 చెరుకువాడ రఘునాథరాజు గృహనిర్మాణశాఖ ఆచంట క్షత్రియ పశ్చిమ గోదావరి
12 కురసాల కన్నబాబు వ్యవసాయం కాకినాడ రూరల్ కాపు తూర్పు గోదావరి
13 కొడాలి నాని పౌరసరఫరాలు గుడివాడ కమ్మ కృష్ణా
14 పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమశాఖ కురుపాం ఎస్టీ విజయనగరం
15 తానేటి వనిత మహిళా సంక్షేమం కొవ్వూరు ఎస్సీ పశ్చిమ గోదావరి
16 పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమశాఖ అమలాపురం ఎస్సీ తూర్పుగోదావరి
17 అంజద్ బాషా మైనార్టీ సంక్షేమశాఖ కడప మైనారిటీ కడప
18 వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ విజయవాడ వెస్ట్ ఆర్యవైశ్య కృష్ణా
19 పేర్ని నాని రవాణా, సమాచారశాఖ మచిలీపట్నం కాపు కృష్ణా
20 మేకతోటి సుచరిత హోంశాఖ, విపత్తు నిర్వహణశాఖ పత్తిపాడు ఎస్సీ గుంటూరు
21 మోపిదేవి వెంకటరమణ మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ రేపల్లె బీసీ గుంటూరు
22 నారాయణస్వామి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు గంగాధర నెల్లూరు ఎస్సీ చిత్తూరు
23 గుమ్మన జయరాం కార్మిక, ఉపాధి కల్పన ఆలూర్ బీసీ కర్నూలు
24 శంకర్ నారాయణ బీసీ సంక్షేమం పెనుగొండ బీసీ (కురుమ) అనంతపురం
25 అనిల్ కుమార్ యాదవ్ సాగునీటి పారుదల నెల్లూరు సిటీ బీసీ నెల్లూరు