అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి.. బాబు ప్లాన్ !

Friday, January 11th, 2019, 08:40:49 AM IST

సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏపీ ఎన్జీవోల సంఘానికి ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకు సన్నద్ధమయ్యారు. ఈమేరకు పన్నుల శాఖలో తన ఉద్యోగం నుండి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. అలాగే ఎన్జీవోల సంఘం అధ్యక్ష పదవికి, ఉద్యోగుల జేఏసి చైర్మన్ పదవికి కూడ రాజీనామా చేశారు.

ఇంకొన్ని రోజుల్లో ఐదు ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒక స్థానాన్ని ఇస్తానని చంద్రబాబు అశోక్ బాబుకు మాటిచ్చారని, అందుకే అశోక్ బాబు ఉద్యోగం మానేసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా అశోక్ బాబు ముఖ్యమంత్రి ద్వారా ఉద్యోగులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడం చేశారు. అందుకే ఆయన మాటంటే సంఘంలో మంచి విలువ ఉంది. కనుక ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం ద్వారా ఉద్యోగుల అండ ప్రభుత్వానికి పూర్తిగా ఉంటుందనేది చంద్రబాబు ఆలోచన కావొచ్చు.