ఏపి దశలవారీగా మాఫీ

Wednesday, September 24th, 2014, 08:49:33 PM IST


ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీపై చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ నుంచి రైతుల రుణమాఫీ చేపడతామని ఆయన అన్నారు. తొలివిడతగా రుణమాఫీ కోసం పదివేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులోపు అన్ని రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. ముఖ్యంగా 50వేల రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధంగా లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. అయితే, బ్యాంకులు రుణాలు తీసుకున్న వారి వివరాలను సక్రమంగా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మాత్రమే లబ్దిదారుల వివరాలు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.