ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. రాహుల్ గాంధితో చంద్ర‌బాబు భేటి..?

Thursday, November 1st, 2018, 10:39:20 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాహుల్ గాంధిని క‌లువ‌నున్నార‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. సేవ్‌ నేషన్‌’ పేరుతో బీజేపీ వ్య‌తిరేక పార్టీలన్నిటిని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి.. జాతీయ స్థాయిలో కూట‌మిని ఏర్పాటు చేసే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వారం వ్య‌వ‌ధిలోనే రెండోసారి ఢిల్లీకి ప్ర‌యాణ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

ఇక దేశంలో త‌ర్వ‌లోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల జ‌రుగ‌నున్న నేప‌ధ్యంల‌తో రాహుల్ గాంధీతో – చంద్ర‌బాబు భేటీ పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంది. అంతే కాకుండా.. భాజపాయేతర కూటమి ఏర్పాటుపైన కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజ‌కీయ వర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో బాజాపా యేత‌ర కూట‌మి ఏర్పాటు చేయ‌డానికి..శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, అఖ‌లేష్ యాద‌వ్, వామ‌ప‌క్ష నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ కానున్నార‌ని స‌మాచారం.

ఇక తెలంగాణలో ఇప్పటికే మ‌హాకూట‌మిలో భాగంగా కాంగ్రెస్ – టీడీపీ క‌లిసి పనిచేస్తున్నాయి.. దీంతో ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ కు, కేంద్ర స్థాయికి కూడా విస్తరించబోతుందా అని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆసక్తి నెల‌కొంది. అయితే నాడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్‌ని గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భూస్థాపితం చేసిన ఏపీ ప్ర‌జ‌లు..చంద్ర‌బాబు వేస్తున్న తాజా అడుగుల పై ఎలాంటి రియాక్ష‌న్ ఇస్తారో చూడాలని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments