ఏపీ పాలిటిక్స్ సెన్షేష‌న్.. జ‌గ‌న్ టైమ్ స్టార్ట్.. వైసీపీలోకి మ‌రో మాజీ మంత్రి..?

Saturday, November 10th, 2018, 09:59:06 AM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార, ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌ల‌స‌ల జోరు కూడా పెరిగింది. అసంతృప్త నేత‌లు త‌మ రాజ‌కీయ భవిష్య‌త్తు కోసం పార్టీలు మారేందుకు వెనుకాడ‌డంలేదు. ఈ క్ర‌మంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఇటీవ‌ల‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ-కాంగ్రెస్ మైత్రితో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన వ‌సంత‌కుమార్, తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో ఎన్నిక‌లకు స‌మ‌యం చాలా త‌క్కువ ఉన్నందున.. వట్టి వసంతకుమార్ ప్రయాణం ఎటువైపు సాగుతుందనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్ర‌మంలో వ‌సంత కుమార్ త‌న స‌న్నిహితులు అనుచ‌రుల‌తో స‌మావేశం అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక గ‌తంలో ఆయన చిరంజీవి కుటుంబానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆయ‌న జనసేనలో చేరే అవ‌కాశం ఉంద‌ని టాక్ వ‌చ్చింది. అయితే తాజాగా వ‌సంత కుమార్ వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు స‌మాచారం.

ఎందుకంటే త‌న స్థాయికి ఇప్పుడు జ‌న‌సేన లోకి వెళ్ళినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆపార్టీ అధ‌కారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌.. దీంతో జ‌న‌సేన త‌రుపున వ‌సంత‌కుమార్ గెలిచినా.. పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌దు. ఇక మ‌రోవైపు వైసీపీ ముఖ్య‌నేత‌లు ఇటీవ‌ల వ‌సంత‌ను క‌లిసి మంచి ఆఫ‌ర్ ఇచ్చార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కువ‌శాతం వైసీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌డంతో వ‌సంత కూడా వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో వ‌సంత త‌న స‌న్నిహితుల‌తో చివ‌రిగా చ‌ర్చించి.. రెండు మూడు రోజుల్లోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తార‌ని.. రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments