ఏపీ పాలిటిక్స్ టర్నింగ్ పాయింట్.. 2019 బిగ్ ఫైట్‌.. విజ‌యం ఎవ‌రిదో తేల్చేసిన తాజా స‌ర్వే..!

Friday, November 2nd, 2018, 11:34:22 AM IST

ఏపీ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఈ నేప‌ధ్యంలో అధికార ప్ర‌తిప‌క్షాలు నువ్వా-నేనా అన్న‌ట్టు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు. మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని టీడీపీ భావిస్తుంటే, ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నింస్తోంది. ఇక జ‌న‌సేన కూడా రేసులో తానున్నానంటూ ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఏపీ రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో అనేక స‌ర్వేలు కూడా తెర పైకి వ‌స్తున్నాయి. తాజాగా రిప‌బ్లిక్- సీఓట‌రు స‌ర్వే రిజ‌ల్ట్స్ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేప‌తున్నాయి.

ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే.. ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల్లో వైసీపీకే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆ స‌ర్వే తేల్చింది. ఇక ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఎవ‌రికెన్ని లోక్‌స‌భ స్థానాలు వ‌స్తాయో తేల్చేసింది రిపబ్లిక్- సీఓటరు సర్వే. ఈ నేప‌ధ్యంలో అధికార పార్టీకి షాక్ త‌ప్ప‌ద‌ని ఆ స‌ర్వే తేల్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 20 లోక్‌స‌భ స్థానాలు వ‌స్తాయ‌ని రిపబ్లిక్- సీఓటరు సర్వే తేల్చింది. అలాగే అధికార టీడీపీకి ఐదు స్థానాల‌కే ప‌రిమితం కానుంద‌ని ఆ స‌ర్వే షాకింగ్ విష‌య‌లు బ‌య‌ట‌పెట్టింది. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో 8 లోక్‌స‌భ స్థానాలుతో స‌రిపెట్టుకున్న వైసీపీకి ఈసారి ప‌క్కాగా 20 స్థానాలు వ‌స్తాయ‌ని రిపబ్లిక్- సీఓటరు సర్వే తేల్చ‌డంతో అధికార టీడీపీకి పెద్ద షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments