వైసీపీకి బిగ్ షాక్.. రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం..!

Wednesday, November 7th, 2018, 11:16:54 AM IST

దేశ‌మంతా దీపావ‌ళి పండుగ జ‌రుపుకుంటుంటే ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి మాత్రం పెద్ద షాకే త‌గిలింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన భూకుంభ‌కోణంలో వైసీపీ నేత మాజీ మంత్రి ధ‌ర్మాన‌ప్ర‌సాదరావు పేరు ఉంద‌ని తెలుస్తోంది. గ‌తంలో విశాఖ భూరికార్డుల ట్యాప‌రింగ్‌ల‌పై సిట్ విచార‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

అయితే సిట్ తాజాగా ఏపీ కేబినేట్‌కు అంద‌జేసిన నివేదిక‌లో ధ‌ర్మాన పేరు ఉంద‌నే వార్త లీక్ అయ్యింది. ధ‌ర్మాన.. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు అనేక అవ‌క‌త‌వ‌కు జ‌రిగాయ‌ని.. ఆయ‌న కుమారుడి పేరు మీద ఉన్న భూములు పైనా ఆరోప‌ణ‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ విశాఖ భూకుంభ‌కోణంలో టీడీపీ నేత‌లు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే తాజాగా సిట్ నివేధిక పై ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు స్పందించారు.

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఇలాంటి బుర్ర‌త‌క్కువ జిమ్మిక్కులు చేయ‌డం అల‌వాటు అని.. విశాఖ భూముల విష‌యంలో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. చంద్ర‌బాబు స‌ర్కార్ ఇచ్చే నివేదిక‌లకు విశ్వ‌స‌నీయ‌త లేద‌ని.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ఇచ్చే నివేదిక‌లు ఎలా ఉంటాయో అంద‌రికీ తెలుస‌ని.. దీంతో ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేద‌ని.. ఇక సిట్ ఇచ్చిన‌ రిపోర్టు చూసిన తర్వాతనే తాను పూర్తి స్థాయిలో స్పందిస్తానని ధ‌ర్మాన‌ చెప్పారు.