ఏపీని ఆదర్శ రాష్ట్రం చేస్తాం

Thursday, September 18th, 2014, 05:33:21 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పతివాడపాలెంలో దివంగతముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పతివాడ గ్రామస్థులతో చంద్రబాబు ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తాయారు చేస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాను విద్యాకేంద్రంగా చేస్తామని తెలిపారు. అలాగే రైతుల రుణమాఫీ చేసి తీరుతామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్ళలో రాష్ట్రం అధోగతి పాలైందని బాబు విమర్శించారు. ఇక వ్యవసాయం లాభసాటిగా సాగాలని చంద్రబాబు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రతీ గ్రామం ఆరోగ్యంగా ఉండాలని, ప్రతీ ఇంటికి తాగునీరు, నిరంతర విద్యుత్ అందిస్తామని చంద్రబాబు భరోశా ఇచ్చారు.