మీ ఐఫోనే మీ శత్రువు..యూజర్లని వణికిస్తున్న చేదు నిజం !

Sunday, October 29th, 2017, 11:06:13 AM IST

మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ పచ్చి నిజాన్ని అంగీకరించి జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. ఐఫోన్ అనేది ఓ స్టేషన్ సింబల్ గా మారిపోయింది. అందుకే ధర ఆకాశాన్ని తాకుతున్నా డిమాండ్ కూడా అదే రేంజ్ లో ఉంది. యాపిల్ సంస్థకు ప్రతిష్టాత్మకమైన ఈ ఐఫోన్ యూజర్ల పాలిట ఎలా శాపంగా మారిందో అనే విషయాన్ని గూగుల్ సంస్థకు చెందిన ఓ ఇంజనీర్ కనిపెట్టి మరీ బహిర్గతగా పరిచాడు. ఈ విషయం ప్రస్తుతం ఐఫోన్ వినియోగ దారులని కలవర పెడుతోంది.

ఐఫోన్ యూజర్ సేఫ్టీ విషయంలో అంత సురక్షితం కాదనేది గూగుల్ కు చెందిన ఫెలిక్స్ క్రాస్ అనే ఇంజనీర్ చెబుతున్న మాట. ఈ విషయాన్ని అతడు నిరూపించాడు కూడా. ఐఫోన్ ని సైబర్ నేరగాళ్లు సులువుగా హ్యాక్ చేయవచ్చు అని ఇతడు నిరూపించాడు. ఐఫోన్ లోని కొన్ని యాప్స్ ని సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా మార్చుకుని యూజర్ కు తెలియకుండానే ఫ్రంట్ లేదా బ్యాక్ కెమెరాలని ఆన్ చేసేస్తున్నారట. దీని వలన యూజర్ ఏం చేసినా వారికి కనిపిస్తుంది. అంటే యూజర్ కు తెలియకుండానే అతడిపై సైబర్ నేరగాళ్లు కన్నేసి ఉండవచ్చు. ఈ హ్యాకింగ్ ని ఫెలిక్స్ క్రాస్ చేసి మరి చూపించాడు. సో.. ఐఫోన్ యూజర్స్ అంతా జాగ్రత్తగా మెలగాలి. లేకుంటే మీ ఐఫోన్ లోని కెమెరా మీకు తెలియకుండానే ఆన్ అయిపోతుంది.

  •  
  •  
  •  
  •  

Comments