2018 లో మూడు కొత్త మోడళ్ళు రిలీజ్ చేయనున్న యాపిల్ !

Monday, January 29th, 2018, 11:44:26 AM IST

ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ దిగ్గజం ఆపిల్ ఈ సంవత్సరం మూడు రకాల మోడళ్లను విడుదల చేయనుందని ఆ సంస్థ కేజిఐ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మింగ్ చి కుయో ఈ విషయాన్ని వెల్లడించారు. ఐ ఫోన్ ఎక్స్ , ఐ ఫోన్ ఎక్స్ ప్లస్ , తక్కువ ధరలో 6.1 అంగుళాల అతి పెద్ద డిస్ప్లే తో ఐ ఫోన్ ఎక్స్ ను విడుదలచేస్తునట్లు తెలిపారు. ఈ ఫోన్ ను బడ్జెట్ ఆప్షన్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ వెర్షన్ డిస్ప్లే కోసం జపాన్ డిస్ ప్లే 70 శాతం ఎల్ సి డి ప్యానెల్స్ ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. 2017 మోడల్ ఐ ఫోన్ ఎక్స్ కంటే పెద్ద బాటరీ కలిగివుండే ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ బెజెల్స్ లో రూపొందుతొందని దీనిలో ఫేస్ ఐ డి , యానిమోజీస్ వుంటాయని అన్నారు. సింగల్ రేర్ కెమెరా, 3డి టచ్, అల్యూమిమినియం ఫ్రేమ్ మరికొన్ని ఫీచర్లు గా తెలుస్తోంది. ఈ ఐఫోన్ ఎక్స్, అచ్చం ఐఫోన్ ఎస్ఈ 2 మోడల్ ని పోలి ఉంటుందని, మరియు వైర్లెస్ ఛార్జ్ మోడ్ తో మార్కెట్లోకి వస్తున్నట్లు డిజిటైమ్ ద్వారా సమాచారం తెలుస్తోంది. మిగతా రెండు మోడళ్ళు ఐఫోన్ ఎక్స్ (2018), ఐఫోన్ ఎక్స్ ప్లస్ లు వరుసగా 6.5, 5.8 అంగుళాల డిస్ప్లే కలిగివుండనున్నాయి. ఐ ఫోన్ ఎక్స్ ప్లస్ కు 4 జిబి రామ్, 3300-3400 ఎంఏహెచ్ బాటరీ తో రానున్నాయి. నిజానికి డిజిటైమ్స్ రిపోర్ట్ రెండు ఎల్ సి డి డిస్ప్లే, మరొక రెండు ఓ ఎల్ఈ డి డిస్ప్లే ఫోన్ పై పనిచేస్తుండగా అయితే చివరిగా ఈ రిపోర్ట్ లాంచింగ్ కు యాపిల్ మూడు మోడళ్ళనే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇందులో ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఐఫోన్ ఎక్స్ , మే లేదా జూన్ లో విడుదల అవుతున్నట్లు డిజిటైమ్స్ చెపుతోంది.