ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త‌

Wednesday, September 28th, 2016, 08:21:25 AM IST

appsc
ఏపీపీఎస్సీ ఇప్ప‌టికే గ్రూప్స్, పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ జాబ్స్‌తో పాటు ప‌లు శాఖల‌కు సంబంధించి నోటిఫికేష‌న్లు జారీ చేసింది. తాజాగా 256 పోస్టుల భ‌ర్తీలో భాగంగా మ‌రో మూడు రోజుల్లో కొత్త నోటిఫికేష‌న్ కు రంగం సిద్దం చేస్తోంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ చైర్మ‌న్ ఉద‌య్ భాస్క‌ర్ ఓ ప్ర‌క‌టన రిలీజ్ చేశారు. మొత్తం 4009 పోస్టుల‌కు గాను ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అయితే ముందుగా 256 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేస్తున్న‌ట్లు తెలిపారు. మిగ‌తా పోస్టుల‌కు ఏడాది చివ‌రిక‌ల్లా మ‌రో కొత్త నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని తెలిపారు. అయితే ఈ పోస్టుల‌కు 25 వేల‌కంటే ఎక్కువ మంది ద‌ర‌ఖాస్తు చేస్తే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా స్క్రుటినీ చేస్తామ‌ని తెలిపారు.

అయితే ఏపీ స‌ర్కార్ ఇస్తోన్న నోటిఫికేష‌న్లు ఊరించే విధంగా ఉన్నాయి త‌ప్ప ఉద్యోగాలు వ‌చ్చేలా క‌నిపించ‌లేద‌ని అభ్య‌ర్ధులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అటు పోలీసు శాఖ ద్వారా గానీ…ఇటు ఏపీపీఎస్సీ ద్వారా గానీ భ‌ర్తీ అయ్యే పోస్టుల సంఖ్య స్వ‌ల్పంగా ఉంది. పోటీ ల‌క్ష‌ల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా శాఖ‌లో ఉద్యోగాల సంఖ్య పెంచితే కొంద‌రికైనా న్యాయం జ‌రుగుతుంద‌ని అభ్య‌ర్ధులు డిమాండ్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments