అరకు కాఫీ అదుర్స్ అంటున్న మంత్రి !

Sunday, January 21st, 2018, 08:14:57 AM IST

విశాఖపట్నం లోని అరకు కాఫీ రుచి మర్చిపోలేనిది అని అంటుంటారు. అరకు కాఫీ కి చంద్రబాబు ప్రభుత్వం బ్రాండింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సచివాలయం లోని సమావేశ మందిరంలో ఏపీ గిరిజన సాంఘిక సంక్షేమ శాఖామంత్రి నక్క ఆనంద్ బాబు అరకు కాఫీ ప్యాకెట్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఏపీ ఎక్సయిజ్ శాఖామంత్రి జవహర్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా జవహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరకు కాఫీ రుచి అద్భుతమని, ఇకపై తాను ఈ కాఫీనే తాగుతానన్నారు. అరకు వాలీ ఇన్ స్టెంట్ కాఫీ 2 గ్రాములు ప్యాకెట్లు 4 లక్షలు, 10 గ్రాముల ప్యాకెట్లు 1 లక్ష విడుదల చేస్తున్నామన్నారు. నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ ఈ రుచికరమైన కోఫీ ని ప్రజలు సేవించి రుచి చూసి ఈ విధమైన గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. కాఫీ గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేయించి మార్కెటింగ్ చేసి వచ్చిన లాభాలను వారికి అందించడమే గిరిజన సహకార సంస్థ లక్ష్యమని ఆయన అన్నారు. 2 లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజనుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గంజాయి సాగుచేసుకునే గిరిజనులను ఆదుకోవడానికి కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు కాఫీ రుచిని ప్రపంచానికి పరిచయం చేసారని, గిరిజనులకు నెలకు రూ.10 వేలు ఆదాయం సంపాదించేలా తగు చర్యలు తీసుకుని అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు…. తాను కూడా రోజు ఇకపై ఈ కాఫీ రుచిని ఆస్వాదిస్తానన్నారు….