ఫస్ట్ హాఫ్ టాక్ : అరవింద సమేత

Thursday, October 11th, 2018, 12:01:21 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో మొదటి సారి వస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈచిత్రం ఫై అభిమానుల అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో భారత కాలమానం ప్రకారం ఉదయం 2గంటలకు ప్రారంభమైంది. మరి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్ గత చిత్రాలకు బిన్నంగా ఎవరు ఊహించని విధంగా ఈసినిమా ను ప్రారంభించాడు. సినిమాలో వచ్చే మొదటి ఫైట్ అదిరిపోయిందట. సినిమా మొదటి 20 నిముషాలు గ్రిప్పింగ్ సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగుతుందట. ఇక ఇంటర్వెల్ ఫైట్ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచిందని ఒక మంచి ట్విస్ట్ తో సినిమా ఫస్ట్ హాఫ్ ముగించుకుందని సమాచారం.

మరి ఆ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఇంకా ఆసక్తిగా మారుతుందా లేదో చూడాలి సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసేది కూడా సెకండ్ హాఫ్ కాబట్టి మొత్తం సినిమా పూర్తి అయినా తరువాతే సినిమా ఫై ఒక అంచనాకు రావచ్చు. పూర్తి రివ్యూ కోసం నేటి ఏపీ.కామ్ ను చూస్తూ వుండండి