సమీక్ష : అరవింద సమేత – ఎమోషనల్ ఫ్యాక్షన్ డ్రామా

Thursday, October 11th, 2018, 08:01:01 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

బాసి రెడ్డి (జగపతి బాబు ) మరియు నారప రెడ్డి ( నాగబాబు) వర్గాల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) ఈ రెండు వర్గాల మధ్య గొడవలను తగ్గించి ఊర్లో శాంతియుత వాతావరణం కోసం పోరాడే నాయకుడు. ఈ క్రమంలో వీర రాఘవ అనుకున్నది సాధించాడా ? ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విందంగా ప్రభావితం అయ్యాయి అనేదే మిగితా కథ.

విశ్లేషణ :

రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈచిత్రం చాలా వరకు ఆకట్టుకుందనే చెప్పాలి. ప్రధానంగా ఆయన రాసిన డైలాగ్స్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు , క్లైమాక్స్ చిత్ర విజయం లో కీలక పాత్రను పోషించాయి. ఇక ప్రథమార్థంలో సినిమా ప్రారంభములో వచ్చే 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షుకులను కట్టిపడేశాయి. ఈచిత్రంతో ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త కోణాన్ని చూపెట్టడంలో త్రివిక్రమ్ విజయం సాధించాడు. ఇక ఎన్టీఆర్ నటన ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. మాములు సన్నివేశాలను కూడా తన నటనతో ఎలివేట్ చేశాడు. సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు.

ఇక ప్రతి నాయకుడి పాత్రలో నటించిన విలక్షణ నటుడు జగపతి బాబు తన కెరీర్ లో మరో గుర్తిండిపోయే పాత్ర చేసి మెప్పించారు. హీరోయిన్ పూజా హెగ్డే కు ఈచిత్రంలో మంచి పాత్ర దొరికింది. ఆమె ఆ పాత్రలో పర్వాలేదనిపించింది. ఇక సపోర్టింగ్ రోల్స్ లో నటించిన దేవయానీ , సితార , సుప్రియ పథక్ వారి పాత్రల మేర చక్కగా నటించారు. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కు ఏం మాత్రం స్కోప్ లేని పాత్ర లభించింది. కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా తన పాత్రతో హాస్యాన్ని అందించలేకపోయాడు.

ప్లస్ పాయింట్స్ :

  • ఎన్టీఆర్ నటన
  • సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు , క్లైమాక్స్
  • ఫస్ట్ హాఫ్ లో మొదటి 20నిమిషాలు

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ స్టోరీ
  • ఫస్ట్ హాఫ్
  • కామెడీ లేకపోవడం

తీర్పు :

సీరియస్ ఫ్యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన , ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు చిత్రానికి హైలైట్ అవ్వగా కామెడీ లేకపోవడం ,రొటీన్ స్టోరీ చిత్రానికి మైనస్ అయ్యాయి. చివరగా ఈచిత్రం కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఈ పండగ సీజన్ లో ఫ్యామిలీతో కలిసి ఒక సారి ఈసినిమా చూడొచ్చు.

Rating : 3.25/5