అరవింద సమేత రేపే విడుద‌ల… క‌థ మాత్రం నేడే లీక్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..?

Wednesday, October 10th, 2018, 11:48:23 AM IST

టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం అక్టోబ‌ర్ 11న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయితే ఇంత‌లోనే ఈ సినిమాకు సంబంధించిన క‌థ లీక్ అయ్యిందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు జోరుగా ట్రాల్ అవుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నం చూస్తే.. రాయ‌ల‌సీమ ప‌క్కా ఫ్యాక్ష‌న్ కుటుంబంలో పుట్టిన వీర రాఘ‌వ‌(ఎన్టీఆర్‌).. ప‌ట్నంలో చ‌దువుకుంటూ ఉంటాడు. కాలేజ్‌లో చ‌దువుకునేట‌ప్పుడు త‌ను అర‌వింద ప్రేమ‌లో ప‌డుతాడు. క‌ట్ చేస్తే అనుకోకుండా ఊరికి వెళ‌తాడు. ఊరిలో అడుగుపెట్టిన రాఘ‌వ‌కి అక్క‌డ క‌క్ష్య‌లలో కొట్టుకు చ‌స్తున్న‌జ‌నాలు క‌నిపిస్తారు.

అయితే రాఘ‌వ ఫ్యామిలీ కూడా ఫ్యాక్ష‌న్ ఫ్యామిలీనే. అక్క‌డి ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌కే త‌న తండ్రిని కోల్పోతాడు రాఘ‌వ‌. అలాంటి వాతావ‌ర‌ణంలో పెరిగిన రాఘ‌వ‌.. అక్క‌డి ప‌రిస్థితుల‌ను పూర్తిగా మార్చాలంటే అక్క‌డ ఫ్యాక్ష‌ను పూర్తిగా అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. పూర్తిగా ఫ్యాక్ష‌న్ ఫ్యామిలీలో పుట్టిన రాఘ‌వ‌కి అలాంటి ఆలోచ‌న ఎలా వ‌చ్చింది.. అత‌ను త‌ను పుట్టిన ప్రాంతంలో ఫ్యాక్ష‌ను ఆప‌గ‌లిగాడా.. రాఘ‌వ జ‌ర్నీలో అర‌వింద పాత్ర ఎంటీ.. ఇప్పుడు తాజాగా ఇదే మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ ట్రాల్ అవుతోంది. మ‌రి ఈ క‌థ‌లో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ ఇప్పుడీ వార్త మాత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.