వీర‌రాఘ‌వుని ప్రీబిజినెస్ లెక్క‌లివే

Thursday, October 4th, 2018, 10:49:04 PM IST

ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్ సాధించాల్సిన టైమ్ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ జైల‌వ‌కుశ అత‌డి కెరీర్ బెస్ట్. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 80 కోట్ల మేర షేర్ వ‌సూలు చేసింది. థియేట్రిక‌ల్ రైట్స్ స‌హా ర‌క‌ర‌కాల మార్గాల్లో 100 కోట్లు పైగానే బిజినెస్ సాగించింద‌ని అప్ప‌ట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు అంత‌కుమించి అర‌వింద స‌మేత ప్రీబిజినెస్ చేసింది. ఈ సినిమా అన్ని ఏరియాలు క‌లుపుకుని 93 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించింద‌న్న రిపోర్ట్ ట్రేడ్ నుంచి అందింది.

ఏరియాల‌ వారీగా లెక్క‌లు ప‌రిశీలిస్తే నైజాం- 19.50 కోట్లు, సీడెడ్ – 15కోట్లు, అమెరికా -9.25కోట్లు, కృష్ణ – 5.50కోట్లు(అడ్వాన్సులు), గుంటూరు -7.5కోట్లు, ప‌.గో జిల్లా- 4.90 కోట్లు, నెల్లూరు -3.30 కోట్లు ప్రీబిజినెస్ చేశారు. ఏపీ-తెలంగాణ ఓవ‌రాల్‌గా 71కోట్లు, కర్నాట‌క‌-త‌మిళ‌నాడు-నార్త్ 9.50కోట్లు, ఓవ‌ర్సీస్ -12.50కోట్లు ప్రీబిజినెస్‌ పూర్త‌యింది. తార‌క్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ 100 కోట్ల షేర్ క్ల‌బ్ మూవీ లేదు. అరవింద స‌మేత ఆ లోటు తీర్చాల్సిన స‌న్నివేశం ప్రీబిజినెస్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. అంత వ‌సూలైతేనే బ‌య్య‌రు సేఫ్ అయిన‌ట్టు. ఈనెల 11న రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ద‌స‌రా సెల‌వులు ఈ సినిమాకి క‌లిసొస్తాయ‌నే అంచ‌నా వేస్తున్నారు. అర‌వింద సమేత ట్రైల‌ర్ ఇప్ప‌టికే మాస్‌లోకి దూసుకెళ్లింది.