బిజెపి నేతలు నా సవాలుకు సిద్దమేనా : సిపిఐ రామకృష్ణ

Sunday, June 10th, 2018, 03:20:18 PM IST

నేడు సిపిఐ నేత రామకృష్ణ కేంద్ర బీజేపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భాగంగా ప్రసంగించిన ఆయన బిజెపి నేతలు మోసపూరిత వ్యాఖ్యలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. నిజానికి వారు చెపుతున్నట్లు 85 శాతం హామీలు నెరవేరితే మరి రాష్ట్రంలో ప్రజలు ఎందుకు ఇంకా ఇబ్బందులతో అల్లాదురుతున్నారని అన్నారు. మరో వైపు రాష్ట్రానికి రాజధాని విషయంలో కూడా తీవ్ర అన్యాయం చేసారని, ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చే విషయంలో బిజెపి పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేసారు. ఇన్నివిధాలుగా మోసం చేసిన ఆ పార్టీ ప్రజల ముందుకు వచ్చి ఏవిధంగా చెప్పిన హామీలన్నీ నెరవేర్చిందని చెప్తుందో, సాక్ష్యాలతో సహా నిరూపించి చూపాలని సవాల్ చేశారు. కొందరు రాజకీయ లబ్ది, అవసరాల కోసం కేంద్రాన్ని విమర్శిస్తున్నారని, నిజానికి కేంద్ర మోసపూరిత వ్యవహారశైలిపై ప్రతి తెలుగువాడు గొంతెత్తి నిరసన వ్యక్తం చేయాలనీ కోరారు.

బుందేల్ ఖండ్ తరహాలో నిధులు మన రాష్ట్రానికి ఇస్తామన్నకేంద్రం కేవలం రూ.350 కోట్లు నిధులతో సరిపెట్టిందని, అవి కూడా కొంతవరకు వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారనే విషయం మోడీకి తెలుసునని, అయినప్పటికి ఆయన మన పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. ఇక్కడ విద్య, వైద్య, పోర్టు తదితర కార్యక్రమాలకు దాదాపు రూ.11,770 కోట్ల మేర నిధులు అవసరమైతే కేవలం రూ.620 కోట్లు మాత్రమే, అంటే 10 శాతం మాత్రమే చేతులు దులుపుకుని ఏదో నిజంగా అంత చేశామని భావనలో వున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే మోడీ పాలనకు, బీజేపీ నేతల నియంతృత్వ, అనాలోచిత పోకడలకు కేవలం మన రాష్ట్రంలోనే కాక దేశంలోని ప్రజలందరూ విసుగు చెంది వున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పక మానరని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments