ట్విట్టర్ వాడుతున్నారా ? అయితే వెంటనే ఇలా చేయండి!

Friday, May 4th, 2018, 03:20:18 PM IST

సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ తమ ఖాతాదారులకు ఒక పిలిపునిచ్చింది. తమ ఖాతాను వాడుతున్న సోషల్ మీడియాలోప్రపంచవ్యాప్తంగా వున్న330మిలియన్ల ఖాతాదారులు తమ పాస్వర్డ్ వెంటనే మార్చుకోమని సూచిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం ట్విట్టర్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అనుమానమొచ్చిన సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు అంతర్గత పర్యవేక్షణ చేపట్టారు. అయితే తాము ఎంతో జాగ్రత్తగా, పకడ్బందీగా చేపట్టిన ఈ విచారణలో ఎటువంటి పాస్వర్డ్ లు చోరీ కాలేదని, అలాని ఖాతాదారుల సమాచారం ఏ మాత్రం దుర్వినియోగం కాలేదని చెపుతోంది.

అందుకే ముందు జాగ్రత్త చర్యగా తమ ఖాతాదారులు పాస్వర్డ్ మార్చుకుంటే మంచిదని అంటోంది. అయితే ఆ సంస్థ బయటకి చెప్పనప్పటికీ అందులోని కొందరు అధికారులు మాత్రం ఖాతాదారుల సమాచారం లీక్ అయినట్లు చెపుతురని సమాచారం. కొద్దిరోజుల క్రితం ట్విట్టర్ లో ఒక బగ్ ని కనిపెట్టమని, అది ఖాతాదారుల పాస్వర్డ్ లను సేవ్ చేస్తోందని, అయితే చివరికి దానిని ఫిక్స్ చేశామని, అందువల్ల ఇకపై ఎటువంటి సమస్య ఉండబోదని స్పష్టం చేస్తోంది. వినియోగదారులు ఎక్కడెక్కడ ట్విట్టర్ ను ఉపయోగిస్తున్నారా అక్కడ ముందు జాగ్రత్త చర్యగా పాస్వర్డ్ మార్చుకుంటే

భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఉండదని, అలానే ట్విట్టర్ లో సమస్యలు తలెత్తడం పట్ల క్షమాపణలు కోరింది. ఖాతాదారుల సమాచారం భద్రంగా ఉంచేందుకు తమ సంస్థ ఉద్యోగులు ఎప్పుడు నిరంతరం శ్రమిస్తుంటారని ఎటువంటి అభద్రతా భావం అవసరం లేదని అంటోంది. ఇండికెందుకు ఆలస్యం ఒకవేళ మీకు ట్విట్టర్ లో అకౌంట్ ఉంటె వెంటనే దాని పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోండి మరి…….