వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నిత్యం ఏదో ఒక వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల ధడక్ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ.. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నటు సమాచారం. ఇక తనకి గ్యాప్ దొరికినప్పుడల్లా హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతోంది ఈ కుర్ర భామ.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా జాన్వీ కపూర్, ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ఇద్దరు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్.. జాన్వీని ప్రశ్నిస్తూ.. మీరు, ఇషాన్ ఖట్టర్ ప్రేమలో ఉన్నారా అని షాకింగ్ ప్రశ్న సంధించాడు. దీంతో వెంటనే స్పందించిన జాన్వీ నో అని సమాధానం చెప్పింది. అయితే వెంటనే అందుకున్న అర్జున్.. జాన్వీ -ఇషన్లు డేటింగ్లో లేరు కానీ.. ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తుంటారు అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న జాన్వీ .. అర్జున్ ఇంకేం సీక్రెట్స్ చెబుతాడో అని ఖంగారు పడింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.